డిసెంబర్ 1వ తేదీ ముగిసిన సయ్యద్ మోడీ బ్యాడ్మింటన్ టోర్నిలో ఏపీకి చెందిన సింధు చాంపియన్‌గా నిలిచింది. ప్రపంచ 119వ ర్యాంకర్ వు లువో యు (చైనా)తో 47 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ సింధు 21–14, 21–16తో గెలుపొందింది. ఈ విజయంతో సింధుకు 15,750 డాలర్ల (రూ.13 లక్షల 31 వేలు) ప్రైజ్‌నీమతోపాటు 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. సయ్యద్ మోడీ ఓపెన్‌లో సింధు టైటిల్ నెగ్గడం ఇది మూడోసారి.