నటి ఆత్మహత్య.. కుటుంబ సభ్యులు ఏమన్నారంటే?

83చూసినవారు
నటి ఆత్మహత్య.. కుటుంబ సభ్యులు ఏమన్నారంటే?
హైదరాబాద్ గచ్చిబౌలిలో నటి శోభిత శివన్న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆమె తల్లి, అక్కాచెల్లెళ్లు సోమవారం పోలీసుల విచారణలో పలు విషయాలు వెల్లడించారు. ఆమె ఆత్మహత్యపై తమకు ఎలాంటి అనుమానాలు లేవన్నారు. పెళ్లి తర్వాత సీరియల్స్, సినిమాలు మానేసిందని, తెలుగులో అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చిందని చెప్పారు. ఒంటరిగా ఉండటం, అవకాశాలు రాక డిప్రెషన్‌లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని వారు పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్