కళ్లుచేదిరే బౌలింగ్ వేసిన జడేజా.. బెయిర్‌ స్టో షాక్

76చూసినవారు
ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా బెయిర్‌ స్టోను జడేజా ఔట్ చేసిన విధానం ప్రశంసలు అందుకుంటోంది. క్రీజులో నిలదొక్కుకుంటున్న బెయిర్‌ స్టోను జడేజా 28వ ఓవర్లో ఔట్ చేశాడు. ఆ ఓవర్లో నాలుగో బంతిని జడ్డూ ఆఫ్‌ స్టంప్‌కు కొద్దిగా దూరంగా వేశాడు. అయితే ఆ బంతిని బెయిర్‌ స్టో అడ్డుకునేలోపే బంతి వికెట్లకు తాకింది. దీంతో బెయిర్‌ స్టోకు ఏం జరిగిందో ఒక్క క్షణం అర్థం కాలేదు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్