AP: సినిమా హీరోలకు లేని క్రైజ్ మాజీ సీఎం జగన్‌కు ఉందని ఆ పార్టీ నేత కన్నబాబు అన్నారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ జనసంద్రమేనని చెప్పారు. ‘విజయవాడలో వల్లభనేని వంశీని పరామర్శించడానికి వెళ్లినప్పుడు, పాలకొండ పర్యటనకు వెళ్లినప్పుడు జగన్‌ను చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. ఈ జన ప్రభంజనాన్ని చూసి కూటమి నేతలు తట్టుకోలేకపోతున్నారు. ఎన్నికల్లో వైసీపీ ఓడినా.. పార్టీ చాలా బలంగా ఉంది.’ అని కన్నబాబు అన్నారు.