కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ విమర్శలు

72చూసినవారు
కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ విమర్శలు
AP: కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆదివారం ప్రకాశంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ కార్యకర్తలు, నాయకులపై కూటమి ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి కక్ష సాధింపులకు పాల్పడుతోందని, రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ముందుకు రాలేదని విమర్శించారు. గిట్టుబాటు ధర లేక రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని, మిర్చి రైతుల పరిస్థితి ఘోరంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్