తండ్రి కళ్లెదుటే కొడుకు మృతి

83చూసినవారు
తండ్రి కళ్లెదుటే కొడుకు మృతి
AP: కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కృష్ణ గుడి సమీపంలో తండ్రీకొడుకులు బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కళ్లెదుటే కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో తండ్రి గుండెలవిసేలా రోదించారు. ఈ దృశ్యాలు స్థానికులను కంటతడి పెట్టించాయి.

సంబంధిత పోస్ట్