మూడు అంతస్తుల బిల్డింగ్ నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం (వీడియో)

65చూసినవారు
ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. శీతల్ మార్కెట్‌లోని మూడంతస్తుల బిల్డింగ్‌ పైకి మద్యం మత్తులో ఓ వ్యక్తి ఎక్కాడు. కిందికి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. కింద పడే సమయంలో హైవోల్టేజ్ విద్యుత్ వైర్లలో చిక్కుకున్నాడు. ఆ తర్వాత రేకుల షెడ్‌పై పడిపోయాడు. కాసేపు బాధితుడు లేవలేదు. ఒక్కసారిగా పైకి లేచి అరవడం ప్రారంభించాడు. అతడికి ప్రాణాపాయం తప్పడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్