యూపీలోని బరేలీలో శనివారం ఊహించని ఘటన జరిగింది. ముకుల్ గుప్తాకు ఆదివారం పెళ్లి జరగాల్సి ఉంది. తన ఫ్రెండ్స్‌తో కలిసి ముకుల్ మెన్స్ సెలూన్‌కు వెళ్లాడు. తిరిగి వస్తుండగా వాహనాల పార్కింగ్ విషయంలో స్థానికంగా ఘర్షణ జరిగింది. దీంతో వరుడిపై ప్రత్యర్థులు దాడి చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు వచ్చిన పోలీసులపై కూడా కొందరు రాళ్లు రువ్వారు. ఈ కేసులో మొత్తం 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.