ఓటర్, ఆధార్ లింకింగ్‌పై ఈసీ కీలక ప్రకటన చేసింది. ఓటరు గుర్తింపు కార్డులను ఆధార్‌తో అనుసంధానించే విషయంపై చర్చించడానికి మార్చి 18న సీఈసీ జ్జానేష్ కుమార్ కీలక భేటీ ఏర్పాటు చేశారు. ఓటర్ల జాబితా, ఎన్నికల గుర్తింపు కార్డుకు సంబంధించిన నంబర్లలో జరుగుతున్న అక్రమాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. అలాగే ఈసీ ఇటీవల కాలంలో విడుదల చేసిన మూడు ప్రకటనలపై చర్చ చేయాలని కోరారు.