AP: పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకులో జరిగిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ‘గత సీఎం జగన్ ఎప్పుడూ ప్రజల్లో తిరగలేదు. ఒక వేళ వచ్చినా పరదాలు కట్టుకుని తిరిగేవారు. విమానంలో వచ్చినా కింద చెట్లను కొట్టేసేవారు. ప్రజా సమస్యలపై ఎప్పుడూ మాట్లాడనిచ్చేవారు కాదు’ అని పేర్కొన్నారు. తన జీవితం ప్రజల కోసం అంకితమని తణుకు పర్యటనలో సీఎం చంద్రబాబు తెలిపారు.