తమిళ భాషపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

76చూసినవారు
తమిళ భాషపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు
కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు మధ్య జాతీయ విద్యావిధానం అమలు విషయంలో వివాదం నెలకొన్న సమయంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళం చాలా మధురమైన భాష, మనమంతా తమిళ సంస్కృతిని గౌరవిస్తున్నామని వ్యాఖ్యానించారు. దేశానికి, ఈ ప్రపంచానికి అందిన ఆస్తుల్లో తమిళం ఒకటి అన్నారు. అన్ని భారతీయ భాషలను ఆస్వాదిద్దామని ఆయన పిలుపునిచ్చారు. మన ప్రధాన మంత్రి అదే స్ఫూర్తితో పనిచేస్తున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్