వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు భద్రత కుదింపు పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ అనంతరం ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జగన్‌కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించాలని సూచించింది. దీనికి స్పందించిన ప్రభుత్వం.. బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని రీప్లేస్ చేస్తామని, జామర్ వెహికల్స్ కూడా కేటాయిస్తామని హైకోర్టుకు తెలిపింది.