చెరువులు, నాలాల రక్షణలో కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. శాటిలైట్ మ్యాప్ డేటా బేస్ ద్వారా హైడ్రా ఆయా ప్రాంతాల్లోని చెరువులను గుర్తిస్తోందన్నారు. ఇది చెరువుల సంరక్షణ కోసం ఎంతో ఉపయోగపడుతోందన్నారు. మ్యాప్ ద్వారా ఆక్రమణలను గుర్తించి తొలగిస్తున్నట్లు చెప్పారు. నాలాలు ఆక్రమణకు గురై వాటి మధ్య ఇంటర్ కనెక్టివిటీ పోయి వ్యర్థ జలాలు చెరువుల్లో కలుస్తున్నాయన్నారు.