కన్జ్యూమర్ ఫోరం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి

355చూసినవారు
కన్జ్యూమర్ ఫోరం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి
ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్(APCRPF) కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బద్వేల్ పట్టణంలో ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏపీసిఆర్‌పిఎఫ్ జిల్లా అధ్యక్షులు పి.ఓబులేసు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పి.ప్రభాకర్, జిల్లా కార్యదర్శి నాగిపోగు రవిబాబులు మాట్లాడుతూ.. అందరికీ సమాన హక్కులు కల్పించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి, 18 సంవత్సరాల నిండిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని, భారత దేశ ప్రజలందరి కోసం రాజ్యాంగం రాశాడని వారు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్