భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ పోరాట ఆశయ సాధన కోసం అందరం పాటుబడాలని సిపిఐ ఏరియా సహాయకార్యదర్శి పిడుగు మస్తాన్, మండల కార్యదర్శి రవికుమార్ లు పేర్కొన్నారు. పోరుమామిళ్ళపట్టణంలో అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సిపిఐ, ఏఐటీయూసీ, ఇన్సాబ్, డి హెచ్ పి ఎస్, మహిళా, రైతు సంఘాల నాయకులు, సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.