బద్వేల్ నాలుగు రోడ్ల కూడలి నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం బి. మఠం మండల కమిటీ ఆధ్వర్యంలో అసైన్డ్ లబ్ధిదారులతో ర్యాలిగా వెళ్లి ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శుల జి. శివకుమార్, అన్వేష్ లు మాట్లాడుతూ..16 సంవత్సరాల క్రితం మఠం మండల పరిధిలోని మల్లేపల్లి , సోమిరెడ్డిపల్లి, పాపిరెడ్డి పల్లె , పలుగురాళ్లపల్లె ,
ముడుమాల రెవిన్యూగ్రామాల దళితులకు పేదలకు అసైన్మెంట్ కమిటీలో ఆమోదం పొంది పట్టాలు మంజూరు చేశారన్నారు. ఆ పట్టాలకు ఆయా రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేసి భూమి ఇప్పుటీ వరకు అప్పచేప్పలేదు. 16సంవత్సరాల కాలంలో అధికారుల నిర్లక్యం వలన సమస్య పరిష్కారం కాలేదని వారు విమర్శించారు. ఇప్పటికైనా ఆర్డిఓ, స్థానిక తాసిల్దారు రెవెన్యూ గ్రామ అధికారులతో, సర్వేయర్లతో భూమిని సర్వేచేయించి లబ్ధిదారులకు భూమి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు గోవిందు , రవణమ్మ, సుబ్బమ్మ, మండల కమిటీ నాయకులు సునీల్, అజయ్, రాహుల్, నరసింహ, రాజశేఖర్ పాల్గొన్నారు.