ఈ విద్యా సంవత్సరానికైనా పాఠశాలను ఓపెన్ చేయండి-ఎ పి సి ఆర్ పి ఎఫ్

356చూసినవారు
ఈ విద్యా సంవత్సరానికైనా పాఠశాలను ఓపెన్ చేయండి-ఎ పి సి ఆర్ పి ఎఫ్
గత సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని పాఠశాలలను మూసివేశారని అటువంటి పాఠశాలలో కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం డి నేలటూరు గ్రామపంచాయతీలోని మలుగుడుపాడు ఎస్సీ కాలనీ నందు మూసివేసిన ఎలిమెంటరీ స్కూలు రీఓపెన్ చేసి దూర ప్రాంతాలకు వెళ్తున్న విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని, ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలపల్లె ప్రభాకర్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత సంవత్సరంలో మలుగుడిపాడు ఎస్సీ కాలనీ నందు ఆర్ సి ఏం సొసైటీ స్కూలును మూసివేసారని, ఈ స్కూల్ మూతపడటంతో దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోలేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారని, విద్యార్థులను బయట గ్రామాలకు చదువుకోడానికి పంపించి పిల్లలు ఇంటికి వచ్చేవరకు తల్లితండ్రులు బయపడుతున్నారని వారు పేర్కొన్నారు. ఈ విద్యాసంవత్సరానికైనా ఈ స్కూలు ఓపెన్ చేసి విద్యార్థులకు దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా చేయాలని, అలాగే ఈ స్కూలును ప్రభుత్వ ఆధీనంలో నడపాలని ఆయన కోరారు. ఇలా చేయడం వల్ల విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ఉంటారని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్