కాలం చెల్లిన బస్సులను నడుపుతున్న వెంగమాంబ స్కూల్ యాజమాన్యం

1741చూసినవారు
పోరుమామిళ్ల పట్టణంలోని వెంగమాంబ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం కాలం చెల్లిన బస్సులను నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
పోరుమామిళ్ల నుంచి చుట్టుపక్కల పరిసర ప్రాంతానికి వెళుతున్న బస్సు నుండి వస్తున్న పొగతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తీవ్రమైన పొగతో వెళుతున్న బస్సును గమనించిన ప్రజలు ఈదుల పల్లె సమీపంలో బస్సు ను ఆపారు. అనంతరం ఎస్సై మల్లికార్జున రెడ్డి విద్యార్థులను వేరే బస్సులో పంపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్