వాటర్ ప్లాంట్ల యాజమాన్యం నాణ్యత స్వచ్ఛత పాటించాలి

764చూసినవారు
వాటర్ ప్లాంట్ల యాజమాన్యం నాణ్యత స్వచ్ఛత పాటించాలి
కడప జిల్లాలో అన్ని మున్సిపాలిటీ మండల కేంద్రాల్లో వాటర్ ప్లాంట్ లో నిర్వహించి నీరు ఇంటింటికి ట్యాంకర్లతో సరఫరా చేసే వాటర్ ప్లాంట్ల యాజమాన్యం నీటిని సరిగా శుద్ధి చేయడం లేదని ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ రేట్స్ ప్రొటెక్షన్ ఫోరం(APCRPF)జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలపల్లె ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప మరియు బద్వేల్ ప్రొద్దుటూరు లాంటి ప్రధాన నగరాల్లో వాటర్ ప్లాంట్ లో ఏర్పాటు చేసుకొని కొంతమంది వ్యాపారం చేస్తున్నారని, నీరు సరిగా శుద్ధి చేయడం లేదని నాణ్యత స్వచ్ఛత పాటించడం లేదని కొన్నిచోట్ల లేబర్ సర్టిఫికెట్లు గానీ వాటర్ ప్లాంట్ కు సంబంధించిన లైసెన్సులు గాని లేకుండా సక్రమంగా వాటర్ ట్యాంకర్లు గాని లేకుండా నడుపుతున్నారని, అధిక రేట్లకు నీటిని అమ్ముకుంటున్నా రని, వీటి పైన జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ జిల్లా అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని లైసెన్స్ లేకుండా స్వచ్ఛత నాణ్యత పాటించకుండా ఉన్నటువంటి వాటర్ ప్లాంట్లను సీజ్ చేసి ప్రజలు రోగాల బారిన పడకుండా కాపాడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ సి ఆర్ పి ఎఫ్ జిల్లా అధ్యక్షులు పి ఓబులేసు, జిల్లా కార్యదర్శి ఎన్ రవిబాబు, జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ కే రాజులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్