హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి

2381చూసినవారు
హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి
బద్వేల్ పట్టణంలోని ప్రభుత్వ స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడాలకు ఇచ్చిన మున్సిపల్ అనుమతులను రద్దు చేయాలని మరియు పబ్లిక్ పర్పస్ స్థలాలలో హెచ్చరిక బోర్డు వేసి ఆక్రమణల నుండి కాపాడాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకులు మంగళవారం మున్సిపల్ కమిషనర్ కేవీ కృష్ణారెడ్డికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సిపిఐ బద్వేల్ నియోజకవర్గ సహాయ కార్యదర్శి చంద్రమోహన్ రాజు మరియు పట్టణ కార్యదర్శి బాలు మాట్లాడుతూ.. బద్వేల్ పట్టణంలో ప్రభుత్వ భూములలో మరియు ప్రజా అవసరాల కోసం కేటాయించిన పబ్లిక్ పర్పస్ స్థలాలలో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. మొత్తం మున్సిపల్ కార్యాలయం చుట్టుపక్కలే ఈ అక్రమాలు జరుగుతున్నాయన్నారు. రెవిన్యూ మున్సిపల్ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఈ అక్రమార్కులు సృష్టించిన నకిలీ డాక్యుమెంట్లను నమ్మి వారి నిర్మాణాలకు మున్సిపల్ అధికారులు టౌన్ ప్లానింగ్ అప్రూవల్ ఇంటి నెంబర్లు కులాయి కనెక్షన్లు ఇస్తున్నారన్నారు. వీటిని ఆధారంగా చూపించి వీరు నిర్మించిన అక్రమ నిర్మాణాలను లక్షలాది రూపాయలకు అమ్ముకుంటూ ప్రజలను మోసగిస్తున్నారని చెప్పారు. వెంటనే మున్సిపల్ అధికారులు ఇచ్చిన అనుమతులను రద్దుచేసి, మున్సిపాలిటీ పరిధిలో గల పబ్లిక్ పర్పస్ స్థలాలలో హెచ్చరిక బోర్డులు వేసి ఆ స్థలాలను స్వాధీనం చేసుకొని ప్రభుత్వ మరియు ప్రజల భవిష్యత్తు అవసరాలకు వినియోగించాలని వారు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పట్టణ సహాయ కార్యదర్శి నరసింహ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పడిగే వెంకటరమణ, ఏరియా కార్యవర్గ సభ్యులు పెంచలయ్య, నాగేష్ మరియు వెంకట్రాయుులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్