ఎర్రగుంట్ల: బుడ్డ సెనగ పంట పరిశీలన

62చూసినవారు
ఎర్రగుంట్ల: బుడ్డ సెనగ పంట పరిశీలన
ఎర్రగుంట్ల మండల పరిధిలోని మాలెపాడు , ఇల్లూరు, చిన్నదండ్లూరు గ్రామాల్లో సాగుచేసిన బుడ్డ సనగ పంటలను రైతులతో కలిసి ఎంఏఏవో శ్రీకాంత్ రెడ్డి బుధవారం పరిశీలించారు. సందర్భంగా పలువురు రైతులు ప్రభుత్వం అందించిన రాయితీ విత్తనాలు మొలకలు పూర్తిస్థాయిలో రాలేదని ఆయనకు వివరించారు. నాసిరకం విత్తనాల వల్ల నష్టపోయినట్లు రైతులు తెలియజేశారు. నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి ఉన్న తాధికారులకు నివేదికలను అందజేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్