56మందికి ఉచిత వైద్య పరీక్షలు

1031చూసినవారు
కొండాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 56 మంది గర్భవతులకు సోమవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. కొండాపురం ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ వై. సాంబశివారెడ్డి, డాక్టర్ వి. సుజాత వారికి ఆహార నియమాలు, జాగ్రత్తలు, పలు సూచనలు సందేహాలను తెలిపారు. గర్భవతులకు బీపి, షుగర్, రక్త పరీక్షలు, నిర్వహించారు. గర్భవతులకు, ఆరోగ్య సిబ్బంది కి కొండాపురం మండలం రెడ్డి సంక్షేమ సంఘం వారు భోజన వసతి ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్