మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధురాలికి అంత్యక్రియలు

64చూసినవారు
మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధురాలికి అంత్యక్రియలు
కడప జిల్లా జమ్మలమడుగు మోరగుడి గ్రామంలో నివాసమున్న చదుల్ల రామనాయకమ్మ (90) వృద్ధురాలు అనారోగ్యంతో మరణించారు.గురువారం ఆమె అంతిమ సంస్కరణలు చేయడానికి బంధువులు ఎవరు ముందుకు రాకపోవడంతో గ్రామస్తులు మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ఛైర్మన్ మోరే లక్ష్మణ్ రావుని సంప్రదించారు. వారు వెంటనే స్పందించి హిందు స్మశాన వాటికలో హిందూ సంప్రదాయం ప్రకారంగా రామ నాయకమ్మ అంతిమ సంస్కరణలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్