జమ్మలమడుగు: సమస్యలపై స్పందించినమున్సిపల్ కమిషనర్

72చూసినవారు
జమ్మలమడుగు: సమస్యలపై స్పందించినమున్సిపల్ కమిషనర్
కడప జిల్లా యర్రగుంట్ల మూడో వార్డు సుందరయ్య నగర్లో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జలమయం అయింది. పలు వీధుల్లో వర్షపు నీరు ఇండ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈ విషయాన్ని తెలిసిన నాయకులు మోహన్,సంజీవ,కొండారెడ్డి మున్సిపల్ కమిషనర్ శేషఫణి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించి సుందరయ్య నగర్ కాలనీకిలో పరిస్థితిని పరిశీలించారు. సిబ్బందితో కలిసి ఇళ్లలో నిలిచిన నీటిని టాంకర్లతో బయటకు పంపించారు.

సంబంధిత పోస్ట్