జమ్మలమడుగు: ఈనెల 29,30 తేదీల్లో రాష్ట్ర కమిటీ సమావేశాలు జయప్రదం చేయండి

84చూసినవారు
జమ్మలమడుగు: ఈనెల 29,30 తేదీల్లో రాష్ట్ర కమిటీ సమావేశాలు జయప్రదం చేయండి
కడప జిల్లా జమ్మలమడుగులో ఎన్జీవో కార్యాలయంలో డివైఎఫ్ఐ నాయకులు బుధవారం సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కమిటీ సమావేశాలకు కరపత్రాలు విడుదల చేశారు. డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్ 29, 30 తేదీలలో కడపలో జరుగుతున్న సమావేశాలను విజయవంతం చేయాలని చెప్పారు. ముఖ్య అతిథిగా ఎంపీ ఏ. రహీమ్ హాజరుకానున్నారు అని అన్నారు. సమావేశాల్లో కడప ఉక్కు రాష్ట్ర విభజన హామీలు చర్చించబడతాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్