ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి కౌంటర్ ఇచ్చిన జనసేన

63చూసినవారు
ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి టీడీపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు జమ్మలమడుగు జనసేన కోఆర్డినేటర్ జగదీశ్ కౌంటర్ ఇచ్చారు. ఆదివారం ఎర్రగుంట్లలోని ఆయన
నివాసంలో మాట్లాడుతూ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే తిరుపతి లడ్డూ వ్యవహారాన్ని బయటికి తీసిందని అనడం సమంజసం కాదని పేర్కొన్నారు. తిరుమల లడ్డులో జంతువుల నూనెను వాడటం చాలా బాధాకరమని తెలిపారు.

సంబంధిత పోస్ట్