మైలవరం: పెన్నా నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

61చూసినవారు
మైలవరం: పెన్నా నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మైలవరం నుంచి పెన్నానదికి నీటిని విడుదల చేస్తున్నందున నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదివారం ఏఈ రమేశ్ తెలిపారు. గండికోట రిజర్వాయర్ నుంచి నీటిప్రవాహం పెరగడంతో మైలవరం డ్యాం నుంచి పెన్నా నదికి రాత్రి 9. 30 గంటలకు 10వేల క్యూసెక్కుల వరకు నీరు ప్రవహించే అవకాశం ఉందన్నారు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో నదిని దాటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్