కడప- కర్నూలు జాతీయ రహదారి చెన్నూరు కొత్త రోడ్డు వద్ద చిన్నపాటి వర్షానికి రోడ్డులో నీరుచేరడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారి ఇరువైపులా అప్రోచ్ రోడ్డు, డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయకపోవడంతో రహదారి పొడవునా వర్షపు నీరు నిలుస్తున్నది. చెన్నూరు కొత్త రోడ్డులో చెన్నూరు గ్రామంలోకి వెళ్లే రహదారి వద్ద వర్షపు నీరు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో నీటిలోనే నడవలసిన పరిస్థితి వచ్చింది.