వల్లూరు మండలం పుష్పగిరి సమీపంలోని పెన్నా నదిలో అమ్మవారు, నంది విగ్రహాలు లభ్యమైన విషయం సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది. పుష్పగిరి తీర్థక్షేత్ర ధర్మపరిరక్షణ సమితి అధ్యక్షుడు భారవి ఆధ్వర్యంలో సభ్యులు నది తీరంలోని చెత్త చెదారాన్ని తొలగిస్తుండగా నీటిలో నంది, అమ్మవారి విగ్రహాలు కనిపించాయి. విషయాన్ని పురావస్తు, దేవాదాయశాఖ సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు.