మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనగరం గ్రామం వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. నంద్యాల రోడ్డులోని 49వ జాతీయ రహదారిపై కారు స్కూటర్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో మైదుకూరు పట్టణానికి చెందిన కంచర్ల రుద్రదీపు (23) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మైదుకూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సిఉంది.