బద్వేలు: రేషన బియ్యం పక్కదారి

56చూసినవారు
బద్వేలు: రేషన బియ్యం పక్కదారి
పేదవాడికి పట్టెడు అన్నం కోసం ప్రవేశపెట్టి అమలు అవుతున్న రేషన బియ్యం పథకం పక్కదారి పడుతోంది.బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు కడప ప్రాంతాలలో ఎక్కువగా ఈ అక్రమ వ్యాపారం సాగుతోంది. బద్వేలు కేంద్రంగా ఇప్పుడు మైదుకూరుకు మించి సాగుతున్న ఈ దందాకు ప్రభుత్వ నిఘా పని చేయక పోవడమా లేక అధికారులు చోద్యం చూస్తున్నారా అన్న ఆరోపణలు తప్పడం లేదు. తహశీల్దారు ఉదయభాస్కర్‌ రాజును వివరణ కోరగా అక్రమ బియ్యం రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని, డీలర్లు ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లు మా దృష్టికి తెస్తే చర్యలు చేపడతామన్నా రు. సివిల్‌ సప్లై అధికారులు ప్రత్యేక దృష్టిసారించారని ఇటీవల కాలంలో అక్రమంగా తరలిపోతున్న రేషన బియ్యం రెండులారీలను పట్టుకున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్