దీపం-2 పథకంలో భాగంగా ఉచితంగా ఇస్తున్న మూడు సిలిండర్లకు వినియోగదారుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని జేసీ అదితి సింగ్ సోమవారం హెచ్చరించారు. ఇటీవల ఉచిత పథకానికి సంబంధించి డెలివరీ బాయ్స్ అదనపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం అందిందన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా డిప్యూటీ తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.