విద్యుత్తు బిల్లులు చెల్లింపునకు ఆదివారం కూడా అవకాశం కల్పించినట్లు ఏపీఎస్పీడీసీఎల్ కడప జిల్లా సూపర్డెంట్ ఇంజనీర్ రమణ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కడప జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యుత్తు బిల్లులు వసూలు కేంద్రాలు ఆదివారం కూడా పనిచేస్తాయన్నారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి తమ విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించాలని ఆయన కోరారు.