పోరుమామిళ్ల: 37 మద్యం బాటిల్స్ స్వాధీనం
పోరుమామిళ్ల పట్టణంలో అక్రమంగా మద్యం తరలిస్తున్న దమ్మనపల్లెకు చెందిన బాలచంద్రుని సోమవారం ఎస్సై కొండారెడ్డి అరెస్టు చేశారు. అతని వద్ద 20 మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, వెంకటాపురం గ్రామానికి చెందిన దాసరి కొండయ్య వద్ద 17 బాటిల్స్ స్వాధీనం చేసుకొని, ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.