చక్రాయపేట మండలంలోని గండి క్షేత్రంలోని శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానంలో మంగళవారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించామని, ఆలయ ఏసీ వెంకటసుబ్బయ్య తెలిపారు. ఇందులో భాగంగా ఆలయ అర్చకులచే ఉదయాన్నే స్వామివారికి అభిషేకం కుంకుమార్చన, ఆకుపూజ, మంత్రపుష్పం, తదితర విశేష పూజలు నిర్వహించామన్నారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారన్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.