పులివెందుల పట్టణంలోని స్థానిక శిల్పారామంలో ఆదివారం సాయంత్రం ఏఓ సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన, సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఆకర్షించాయి. ఈ సందర్భంగా చిన్నారులు సినీ, జానపద, కోలాట, శాస్త్రీయ, భక్తి పాటలకు చిన్నారులు వేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ, ఖుషీ సినిమాల పాటలకు చిన్నారులు వేసిన స్టెప్పులు ఆహుతులను ఉర్రూతలూగించాయి.