మంచి ప్రభుత్వం కాదు.. ముంచే ప్రభుత్వం

63చూసినవారు
చంద్రబాబు ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు. ప్రజలను ముంచే ప్రభుత్వమని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. వేంపల్లిలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులైందని, తమ ప్రభుత్వం మంచి ప్రభుత్వమని కూటమి నాయకులు సొంత డబ్బా వాయించుకోవడం హాస్యాస్పదమన్నారు. సూపర్ సిక్స్ హామీలు ప్రధాన కారణమన్నారు. సామాజిక పెన్షన్ తప్ప మిగిలిన ఐదు హామీలు అమలు కావడంలేదన్నారు.

సంబంధిత పోస్ట్