దోమకాటుకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని శుక్రవారం సబ్ యూనిట్ అధికారి సిద్దయ్య ప్రజలకు సూచించారు. పులివెందుల అర్బన్ పరిధిలోని ఎర్రగుడిపల్లెలో ఫ్రైడే - డ్రైడే సందర్బంగా ఇంటింటా ఫీవర్ సర్వే, లార్వా సర్వే నిర్వహించి, నిల్వలున్న నీటిలో అబెట్ పిచికారీ చేసి ప్రజలకు దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. దోమ కాటు వలన మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా వ్యాధులు వస్తాయన్నారు.