తమ ఇండ్ల స్థలాలు తమకు ఇప్పించాలని లబ్ధిదారులు వేడుకుంటున్నారు. శనివారం పులివెందుల పట్టణంలోని స్థానిక రాజారెడ్డి కాలనీలో ఇళ్ల లబ్ధిదారులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాకు గతంలో అప్పటి ప్రభుత్వం ఇండ్ల కోసం ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ప్రస్తుతం ఈ స్థలం మాది అని కొంతమంది భూ కబ్జాదారులు పోలీసులు ద్వారా బెదిరిస్తున్నారు. మా ఇండ్ల స్థలాలు మాకు అప్పగించి న్యాయం చేయాలి అని కోరుతున్నారు.