పులివెందుల: వైభవంగా అయ్యప్పస్వామి జన్మదినోత్సవ వేడుకలు

52చూసినవారు
పులివెందుల: వైభవంగా అయ్యప్పస్వామి జన్మదినోత్సవ వేడుకలు
పులివెందుల లోని కోతి సమాధి సమీపంలో ఉన్న శ్రీఅయ్యప్పస్వామి ఆలయంలో శుక్రవారం అయ్యప్పస్వామి జన్మదినోత్సవం సందర్భంగా ఆలయ నిర్వాహకుడు, గురుస్వామి వెంకట్రామిరెడ్డి అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున 5గంటల నుండి పంచామృతాభిషేకంతోపాటు తోమాల అలంకరణ, విశేష పూజలు, హోమాలు నిర్వహించారు. సాయంత్రం 6గంటలకు భక్తిశ్రద్ధలతో స్వామియే శరణం, అయ్యప్ప స్వామి శరణం అంటూ భజన కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్