పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె చెందిన హేమాద్రి తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి అడవి ప్రాంతంలోని వాగు వద్దకు ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. నీటి లోతు ఎక్కువగా ఉండడంతో హేమాద్రి మునిగిపోయాడని స్నేహితులు పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. శుక్రవారం హేమాద్రి బాడీని గ్రామానికి తీసుకురావడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.