అంధులకు చూపు ఇచ్చే నేత్రదాన కార్యక్రమం మహాపుణ్యకార్యమని పులివెందుల జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముదివేటి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణానికి చెందిన లాయర్ కరుణాకర్‌రెడ్డి చెల్లెలు గోకనపల్లి
తులసీదేవి ఈ మధ్య కాలంలో మరణించడంతో నేత్ర సేకరణ కేంద్రం ఆధ్వర్యంలో ఆమె కళ్లను దానం చేశారు. శనివారం మెజిస్ట్రేట్ ఛాంబర్ లాయర్ కరుణాకర్‌రెడ్డికి ఆయన చేతులమీదుగా జ్ఞాపిక అందజేసి అభినందించారు.