ఉగాది పండుగను పురస్కరించుకొని పులివెందుల అంకాలమ్మ ఆలయంలో అంకాలమ్మతల్లి ద్వారాలలో ఉన్న అమ్మవార్లకు మూడు కిలోల వెండి కవచాలను బహుకరించారు. ఆలయ చైర్మెన్ నాగేంద్రప్రసాద్, ఈఓ కెవి రమణలకు ఆదివారం అందజేశారు. పల్లెట్ వెంకట అశోక్కుమార్రెడ్డి కుటుంబ సభ్యులు, మిట్ట మల్లికార్జునశెట్టి కుటుంబ సభ్యులు మిట్టకరుణాకర్, మిట్టమంజునాథ్ కలసి అమ్మవారికి వెండి కవచాలను చేయించాలని తలచి ఉగాది పండుగరోజున అందజేశారు.