సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరులో గురువారం ఉపసర్పంచ్ ఎన్నిక ఉద్రిక్త పరిస్థితుల మధ్య సాగుతోంది. 11 మంది వార్డు సభ్యులు ఉండగా వైసీపీ వైపు 6 మంది, టీడీపీ వైపు నలుగురు ఉన్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నిక సజావుగా సాగుతున్న సమయంలో టీడీపీ ఉపసర్పంచ్ అభ్యర్థి బాబుల్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడంతో పోలీసులు
బయటకు పంపించారు. దీంతో ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించి అధికారుల ప్రకటన ఆలస్యమవుతుంది.