వేముల మండలంలో జరుగుతున్న ఆక్రమ మైనింగ్ తవ్వకాలపై దాడులు చేసి చర్యలు చేపట్టాలని పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ ధ్రువ కుమార్ రెడ్డి కోరారు. శుక్రవారం వేముల తహశీల్దార్. గీత రాణిని కలిసి ఆక్రమ మైనింగ్ పై పిర్యాదు చేశారు. ఆక్రమ మైనింగ్ తవ్వకాలు వలన చాలా మంది కూలీల ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ అనుమతితో ఉన్న వాటికి పనులు చేసుకోనే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.