పులివెందుల పట్టణంలోని మైత్రి లేఔట్లో గురువారం విజిలెన్స్ అధికారులు సీసీ రోడ్ల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. పులివెందుల నియోజకవర్గంలో పాడా ద్వారా జరిగిన పనులలో భారీగా అవకతవకలు జరిగాయని భావించి కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. పులివెందుల నియోజకవర్గంలో మొత్తం 350 పనులను విజిలెన్స్ అధికారులు తనిఖీ చేయనున్నట్లు తెలిపారు.