రైల్వేకోడూరు: దొంగ ఆన్లైన్ పుణ్యమే దళితులపై దాడికి కారణం

75చూసినవారు
రైల్వేకోడూరు: దొంగ ఆన్లైన్ పుణ్యమే దళితులపై దాడికి కారణం
కాసులకు కక్కుర్తి పడి రెవెన్యూ అధికారులు దొంగ ఆన్లైన్ చేసిన పుణ్యమే పెరుమాళ్ళపల్లి దళితులపై దాడికి కారణమని బికేయంయు అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు పండుగోల మణి విమర్శించారు. బుధవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దళితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే కోడూరు నియోజకవర్గంలో దళితులపై దాడి జరిగితే స్థానిక శాసనసభ్యులు కనీసం దళితులను పరామర్శించ లేదని విమర్శించారు.

సంబంధిత పోస్ట్