విద్యతో పాటు వృత్తి విద్యపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ చైర్మన్ పార్థసారధి అన్నారు. బుధవారం ఓబులవారి పల్లి కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం విద్యార్థినులు రైల్వేకోడూరులోని శిక్షణా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా బాలికలకు టైలరింగ్ వృత్తి, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులపై ట్రస్ట్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు.