రైల్వే కోడూరు: ప్రజలపై విద్యుత్ భారం మోపితే ఉద్యమం తప్పదు

56చూసినవారు
రైల్వే కోడూరు: ప్రజలపై విద్యుత్ భారం మోపితే ఉద్యమం తప్పదు
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపితే భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున ఉద్యమం నిర్వహిస్తామని జిల్లా సహాయ కార్యదర్శి మహేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణ అన్నారు. ఆదివారం రైల్వే కోడూరు సిపిఐ కార్యాలయంలో వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల ఎన్నికలలో తుడిచిపెట్టుకుని పోయిందన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు విద్యుత్ చార్జీలు పెంచవద్దని కోరారు.

సంబంధిత పోస్ట్