ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం అధికారులందరూ ప్రజా దర్బార్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు కావున ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీ దారులు విషయం తెలుసుకొని అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి కి రాకుండా జాగ్రత్త పడాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు.